Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీనటి జమున
నవతెలంగాణ-కల్చరల్
తాను బతికే ఉన్నానని అలనాటి సినీ నటి జమున వివరణ ఇచ్చారు. తాను చనిపోయినట్టు సౌత్ ఇండియా, శాంతి యూట్యూబ్ ఛానల్స్ పదే పదే ప్రచారం చేస్తుండటాన్ని ఆమె తప్పుపట్టారు. యూట్యూబ్ వీక్షకులను పెంచుకొనేందుకు ఆ ఛానల్స్ ఇలాంటి చౌకబారు ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చానల్స్ ఆదివారమే ప్రారంభమయ్యాయనీ, వాటికి ఏం వార్తలు లేక తన మరణ వార్తను పదే పదే ట్రోలింగ్ చేస్తున్నాయని ఆక్షేపించారు. ఈ తరహా ప్రచారం సరికాదని సినీనటి జమునా రమణారావు కుమార్తె స్రవంతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఈ తరహా అసత్య ప్రచారం ఆపాలనీ, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.