Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రత్యమ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించడమే తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2022 లక్ష్యమని తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కే ఆనందాచారి తెలిపారు. మూడురోజుల పాటు జరిగే ఫెస్ట్‌లో కవులు, రచయితలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్ఫూర్తి అధ్యక్షతన ఎంహెచ్ భవన్లో రాష్ట్ర విస్తతస్థాయి సమావేశం జరిగింది. దీనికి త్వరలో నిర్వహించనున్న లిటరరీ ఫెస్ట్ నిర్వహణపై పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. లిటరరీ ఫెస్ట్ 2022లో వాగ్గేయ కారులను పెద్ద ఎత్తున సమీకరించి వారి గేయాలు, నేపథ్యం, రచయిత వివరాలను పొందుపరుస్తూ పుస్తకం తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. సినీగేయ రచయితల సాహిత్యంపై పరిశోధక విద్యార్థులతో విశ్లేషణావ్యాసాలు రాయించి దానిని కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని సమావేశం అభిప్రాయపడింది. దీనికి తెలంగాణ కవులు, రచయితలు సహకరించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్దన, ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, సహాయ కార్యదర్శి సలీమ, రాంపల్లి రమేష్, అనంతోజు మోహనకష్ణ, నాయకులు కపిల రాంకుమార్, లింగమూర్తి, ఖాజా, వెన్నెల సత్యం, వాహెద్ఖాన్, నర్సింహ, చంద్రమౌళి, మద్దిరాల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.