Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
వైద్య విద్య, ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో టీఆర్ఎస్వీ నాయకులతో ఆదివారం సమావేశమైన మంత్రి నూతన విద్యార్థులకు స్వాగతం పలికే వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని స్పష్టంచేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ ఫెక్ సోషల్ మీడియాను ఎండగట్టాలని, నిలదీయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ అభినందించిందని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో 70 ఏండ్లలో 4 మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీపీ శ్వేత, శిక్షకుడు భాగ్యకిరణ్, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.