Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బీరం అరెస్ట్ ొ ముఖాముఖికి బయలుదేరిన ఎమ్మెల్యే
- నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా : జూపల్లి
- ఉద్రిక్తంగా మారిన కొల్లాపూర్... మోహరించిన భద్రతా బలగాలు
నవతెలంగాణ- కొల్లాపూర్
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే.. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య 19 రోజుల నుంచి కొల్లాపూర్ అభివృద్ధి, వ్యక్తిగత విషయాల పట్ల ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖాముఖి చర్చకూ సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి ఆదివారం తన ఇంటి ఆవరణలోనే విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేపై రూ.26 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. డిఫై కాల్వ పూర్తి వేస్తే 2600 ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోతారని, రైతుల కోసం వెళ్ళామన్నారు. భూ నిర్వాసితుల పరిహారం అందించడంలో కుడికిల్ల గ్రామంలో ఎమ్మెల్యే అనుచరులకు ఒక న్యాయం, ఓట్లు వెయ్యని వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించానన్నారు. అందుకే తనపై అడ్డగోలుగా తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. తన బిజినెస్ అవసరాల రీత్యా 1996 ఎల్ఐసీ హౌసింగ్ లోన్ వన్ కింద రూ.1.30 కోట్లు తీసుకుని ఇన్‌టైంలో డబ్బులు చెల్లించి ప్రశంసా పత్రం కూడా తీసుకున్నానని తెలిపారు. 1999లో ప్రుడెన్షియల్ బ్యాంకులో లోను తీసుకుని రూ.7కోట్ల గాను వన్‌టైమ్ సెటిల్మెంట్ గా రూ.14 కోట్లు చెల్లించి క్లియరెన్స్ చేసుకున్నానని వివరించారు రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్ధులు వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప వారి మాటల్లో నిజం లేదన్నారు.
కాగా, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు కుడి పై కాల్వను పూడ్చి వేసిన సంగతి తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. 2,600 ఎకరాలు నీరు పడకపోతే రైతులు నష్టపోతారన్న విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పునరుద్ధరించాలని ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించడంతో ఉద్రిక్త వాతావరణం ఈ క్రమంలో కొల్లాపూర్ నియోజక వర్గ అభివృద్ధిపై జూన్ 26న అంబేద్కర్ చౌరస్తాలో చర్చిద్దామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. ఎమ్మెల్యే వెంటనే.. మీ ఇంటి దగ్గర చర్చిద్దామంటూ జూపల్లికి ప్రతిసవాల్ విసిరారు. ఇరువురు పోలీసుల అనుమతి కోరారు. కానీ శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతివ్వలేదు. ఈ సవాళ్ల మధ్య ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి ఇండ్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరువురిని ఇంటి వెలుపలి నుంచి బయటికి రానివ్వలేదు. అయినా బహిరంగచర్చకు బయలుదేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో పోలీసులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.