Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గజ్వేల్ రైల్వే స్టేషన్ నుంచి మొదటి రైలు సోమవారం ప్రారంభమైందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మనోహరాబాద్-గజ్వేల్ సెక్షన్లో మొదటిసారిగా సరుకు రవాణా రైలు కూడా ఇదేకావటం విశేషమని పేర్కొన్నారు. సరుకుల లోడింగ్, అన్లోడిరగ్ కోసం సరుకు రవాణాకు ఇటీవలే అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 21 బీసీఎన్ వ్యాగన్లలో ఎరువులతో కూడిన మొదటి రేక్ కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్లోని అన్లోడిరగ్ కోసం ఉంచారని తెలిపారు. ఇందులో 1,844 టన్నుల ఎరువులు రవాణా జరిగినట్టు పేర్కొన్నారు.