Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నేటి నుంచి (మంగళవారం) 'రైెతుబంధు' డబ్బులు రైతుల ఖాతాల్లో జమకానున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దఫా కోటి 50,43,606 ఎకరాల్లో రైతుబంధు సాయం అందనున్నదని తెలిపారు. రూ.7521.80 కోట్లు పంపిణీకి సిద్ధంగా వున్నాయని పేర్కొన్నారు. రోజుకు ఒక ఎకరా నుంచి ఆరోహణాక్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. సీసీఎల్ఎ వ్యవసాయ శాఖకు వివరాలు అందించినట్టు తెలపారు.మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని సూచించారు.