Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఎగ్జిబిషన్, సమావేశ మందిర ఏర్పాట్లకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో భూమి పూజ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్, పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.