Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 74 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 17) జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తూ మినిమం టైంస్కేల్ పొందుతున్న 74 మందిలో 22 మంది జనరల్, 52 మంది ఒకేషనల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2016, ఫిబ్రవరి 26న రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 16ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా జూనియర్ కాలేజీల్లో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ అధ్యాపకులకు సంబంధించి వ్యక్తిగతంగా ధ్రువపత్రాలన్నీ పరిశీలించామనీ, సవ్యంగానే ఉన్నాయని వివరించారు. 74 మంది సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టీఎస్జీసీసీఎల్ఏ-475 అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం ప్రకటించారు. మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.