Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్కు చెందిన 63 మంది ఆయుర్వేద వైద్యులను ముంబైలో ఘనంగా సన్మానించారు. ముంబై లోని రాజస్థాన్ డిస్పెన్సరీలో ఆయుర్వేద వైద్యుల పుర స్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులు గౌరవంతో కొత్త శక్తిని పొందుతారని తెలిపారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాజస్థాన్ డిస్పెన్సరీ భారతదేశం లోని మిలియన్ల మంది ప్రజలకు మద్యపానం నుంచి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. హైదరాబాద్కు చెందిన 63 మంది ఆయుర్వేద వైద్యులకు అవార్డు రావడం గమనార్హ మన్నారు. డాక్టర్ నవీద్ ఖాన్ మాట్లాడు తూ ఆయుర్వేద డాక్టర్లు కోవిడ్ -19 నుంచి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. కార్యక్రమంలో ఆయురవేదచార్య డాక్టర్ కర్రస్ హుస్సేన్ ఖాన్, డాక్టర్ విజయపాల్ రెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.