Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ చిత్రంలో ఆలయ గోపురాన్ని తలపించేలా కనిపిస్తున్నది మట్టి స్తంభమే. దీనిపై ఉన్నది దేవుని విగ్రహమో.. మరేదో కాదు. అది హద్దురాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో ఈ దశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. వాసాలమర్రి-కొండాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి మొరం మట్టి అవసరం కావడంతో గుత్తే దారు ఎత్తయిన ప్రదేశంలో రైతుల అనుమతితో తవ్వకాలు జరిపి తీసుకెళ్లారు. ఇలా తవ్వకాలు జరుపుతూ వ్యవసాయ భూముల హద్దురాయి ఉన్న ప్రాంతానికి చేరుకోగా.. స్థానికులు అడ్డు చెప్పారు. దానిని తొలగిస్తే భూముల హద్దులు దొరకవని, అక్కడి వరకు వదిలేయాలని గుత్తేదారుకు సూచించారు. దీంతో ఆయన హద్దురాయిని కదిలించకుండా చుట్టూ తవ్వకాలు జరపడంతో ఇలా 30 అడుగుల ఎత్తున్న మట్టి స్తంభం ఏర్పడింది..
నవతెలంగాణ బొమ్మలరామారం విలేకరి అనిల్ కెమెరాకు చిక్కిన దృశ్యం.