Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు వచ్చేనెల ఒకటి నుంచి మూడో తేదీ వరకు సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ పట్టణంలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం హైదరాబాద్లోని అమృత ఎస్టేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ వచ్చేనెల ఒకటిన రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ హుజూర్ నగర్ పట్టణంలో జరుగుతుందన్నారు. రెండున మహాసభలు ప్రారంభమవుతాయనీ, ఈ సభకు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకయ్య, అతుల్ కుమార్ అంజాన్ పాల్గొంటారని వివరించారు. మూడున రైతులకు పంటల భీమా ఆవశ్యకత, ప్రభుత్వ పథకాల అమలుపై సెమినార్ జరుగుతుందని చెప్పారు. ఇక్రిశాట్ మాజీ ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త కిలారు పూర్ణచందర్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, డీన్, ప్రొఫెసర్ ఎంవి రమణమూర్తి, జన్యుశాస్త్రం మాజీ శాస్త్రవేత్త ఐసీఏఆర్ సోమ మర్ల హాజరవుతారని వివరించారు.