Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్
- హాట్రిక్ రాష్ట్రంగా జార్ఖండ్
- ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆగస్టు 15వ తేదీలోపు కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తామని జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్‌సోరెన్ ప్రకటించారు. నేషనల్ మూy ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో పింఛన్ జయఘోష్ మహాసమ్మేళన్ భారీ బహిరంగ సభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీపీయస్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాదికారి నరేష్ గౌడ్, మ్యాన పవన్ కుమార్, హరికుమార్, ఆంధ్ర ప్రదేశ్ నుంచి రామాంజనేయులు, కర్ణాటక శాంతారం, జార్ఖండ్ అధ్యక్షులు విక్రాంత్, హర్యానా దారివల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ మాట్లాడుతూ జేఎంఎం మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అందరి ఆశల ధ్వని శాశ్వత పింఛన్ తన చెవుల్లో ప్రతిధ్వనిస్తోందన్నారు. జార్ఖండ్ ప్రభుత్వం సామాజిక భద్రత పట్ల సున్నితంగా ఉందని చెప్పారు. అన్ని విభాగాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆగస్ట్ 15 నాటికి సీపీ ఎస్‌ను రద్దు చేస్తామనీ, పాత పింఛన్ విధానాన్ని రాష్ట్రంలో ఉన్న అందరి సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యా యులకు అమలు చేస్తామని వివరించారు. దీంతో ఆ స్టేడియంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్ఎం ఎపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 2004 నుంచి ఇప్పటి వరకు ఈ విధానం వల్ల దేశ వ్యాప్తంగా 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుం బాలు ఇబ్బంది పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలు పాత పింఛన్ విధానాన్ని ప్రకటించి అమలు చేస్తున్నా యని గుర్తు చేశారు. ఇప్పుడు సీపీఎస్‌ను రద్దు చేసిన హాట్రిక్ రాష్ట్రంగా జార్ఖండ్ నిలుస్తుందన్నారు. సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఎంఓపీస్ సభకు వచ్చి ఉద్యోగుల సేవలను గుర్తించి ఆగస్ట్ 15 లోపు పాత పింఛన్ అమలు చేస్తామంటూ ప్రకటించడం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఈ సీపీయస్ ఉద్యమం ఇప్పుడు 26 రాష్ట్రాల్లో కొనసాగుతున్నదని వివరిం చారు. సీఎం హేమంత్ సోరెన్‌ను జ్ఞాపిక, శాలువా, పూలమాలతో సన్మానిం చారు. నవంబర్‌లో బెంగళూరు లో జరగనున్న పింఛన్ భారీ బహిరంగ సభకు హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. ఏపీలోని అనంత పురంలో వచ్చేనెల17న 'న్యాయం కోసం-వాక్ఫర్ పింఛన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్థితప్రజ్ఞ ప్రకటించారు. రాష్ట్రాలన్నీ పాత పింఛన్‌ను ఇస్తుంటే ఏపీలో కొత్తగా జీపీఎస్ విధానం తేవడం ఏంటని ప్రశ్నించారు.