Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మహారాష్ట్రలో పర్యటించారు. ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ మండలం మంగరుల్ గ్రామంలోని బాల్ ఆనంద్ భవన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. వారికి స్థానిక అధికారులు, అంగన్వాడీ టీచర్లు ఘన స్వాగతం పలికారు. అంగన్వాడీ కేంద్రాలను వారు పరిశీలించారు. అక్కడ అమలవుతున్న పథకాలు, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, బాలింతలకు అందిస్తున్న కిట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ వంటి పథకాల వివరాలను మంత్రులు మహారాష్ట్ర అధికారులకు వివరించారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి, అనంతరం టీచర్లు, హెల్పర్లు, విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు వివరించారు. కేసీఆర్ కిట్, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలను వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయితే అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇస్త్తునట్లు వివరించారు.