Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మీయంగా పలకరించుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
- 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు ఐదో చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ప్రకటించిన వారెంట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీజే కుటుంబ సభ్యులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పలువురు మంత్రులు, ఎంపీలు, సీఎస్, డీజీపీ, హైదరాబాద్ మేయర్, ఉన్నతాధికారులు హాజర య్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించారు. సీఎం కేసీఆర్ కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చారు. దర్బార్ హాల్లో సీఎం, సీజే దంపతులతో కలిసి గవర్నర్ కాసేపు ముచ్చటించారు. ప్రమాణస్వీకారం అనంతరం సీజేకు శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కూడా ఆహ్వానించారు. గవర్నర్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు సీఎం హాజరయ్యారు. గవర్నర్ పక్కనే కూర్చొన్న సీఎం..ఇరువురి మధ్య ఎలాంటి విబేధాలు లేవనేవిధంగా వ్యవహరించారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా, సహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఏడాది కాలంగా...
రాజ్‌భవన్ - ప్రగతిభవన్ మధ్య ఏడాది కాలంగా నెలకొన్న విబేధాలు నెలకొన్న విషయం విదితమే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అప్పటి నుంచి గవర్నర్ కార్యాలయంతో సీఎంఓకు దూరం పెరుగుతూ పోయింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభించేశారు. కొన్ని సందర్భాÛల్లో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య పరస్పర సహకారం లేదనే వార్తలు కూడా వచ్చాయి. తన తల్లి మరణించినా సీఎం పలకరించలేదనీ, మహిళ అని వివక్ష చూపుతున్నారని స్వయంగా గవర్నర్ తమిళిసైనే ఆవేదన వెలిబుచ్చారు. ప్రొటోకాల్ తెలియదంటూ ముఖ్య మంత్రిపై పరోక్షంగా ఆమె విమర్శలు చేశారు. గవర్నర్‌పై రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందించారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం రాజ్‌భవన్ వెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత అటువైపు తిరిగి చూడలేదు. దాదాపు 9 నెలల తర్వాత మళ్లీ మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడంతో గవర్నర్‌తో ఉన్న విభేదాలు సమసి పోయినట్టు అనిపిస్తున్నది.