Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీ కార్మికుల ఉపాధి కాపాడాలి
- జులై ఒకటో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : పాలడుగు భాస్కర్
- హైదరాబాద్‌లోని ఎస్వీకే వద్ద నిరసన ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను వెంటనే ఎఫ్‌సీఐ ద్వారా కొనాలనీ, హమాలీ కార్మికుల ఉపాధి కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై జులై ఒకటో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ బియ్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 1500 మిల్లులు మూతపడ్డాయని తెలిపారు. సుమారు 2 లక్షల మంది హమాలీ కార్మికులతో పాటు మిల్లు డ్రైవ ర్లు, దినసరి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు ఇతర ఆధారిత కార్మికు లకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు పనుల్లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్నారని చెప్పా రు. ప్రభుత్వ నిర్ణయంతో రైస్‌మిల్లు వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయిం దన్నారు. మిల్లుల యాజమాన్యులు రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరించినప్పటికీ, వాటిని బియ్యంగా మార్చి అమ్మక పోవడంతో రైస్ మిల్లు యాజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేయకుండా మధ్యలో మానేయటం వల్లనే ఈ స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా రాష్ట్రం చెబుతూ దోబూచిలాడటం వల్లనే ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కస్టం మిల్లిం గ్ రైస్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయించాలనీ, హమాలీ కార్మికు లు, మిల్లు డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, దినసరి కూలీలకు ఉపాధి కల్పించా లని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జయలక్ష్మి, ఆర్.కోటం రాజు, టి.వీరారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జె.వెకంటేష్, ఎస్.రమ, భూపాల్, ఎ.ముత్యంరావు, బి.మధు, రాగుల రమేష్, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సుధాకర్, పి.శ్రీకాంత్, కూర పాటి రమేష్, యాటల సోమన్న, ఆకుల రాజు, రాపర్తి రాజు, ముంజం శ్రీని వాస్, గోపాలస్వామి, పుట్టా అంజనేయులు, సిహెచ్ లక్ష్మినారాయాణ, చాగం టి వెంకటయ్య, ఎం.డి.నూర్జాహాన్, జి.జ్యోతి, నాగమణి, వివి.నర్సింహ, కె.రమణ, సురేష్, బల్రాం, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.