Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో విడుదల చేస్తారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. మంగళవారం ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. దీంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.