Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ఈఐఎస్) సత్తాచాటింది.విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.ఈ మేరకు టీఆర్ఈఐఎస్ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఈఐఎస్ పరిధిలో 35 జూనియర్ కాలేజీలున్నాయని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,742 మంది పరీక్షలు రాయగా 2,674 (97.21 శాతం) ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. 68 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,678 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,534 (94.16 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రని తెలిపారు. 144 మంది ఫెయిలయ్యారని పేర్కొన్నారు.
మోడల్ స్కూళ్లలో ఉత్తమ ఫలితాలు
ఇంటర్ ఫలితాల్లో మోడల్ స్కూళ్లు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లున్నాయని వివరించారు. వాటిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 20,902 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 13,645 (65.28 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 20,586 మంది పరీక్షలు రాస్తే 15,607 (75.81 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని పేర్కొన్నారు. అత్యధిక మార్కులు పొందిన వారిలో ఎంపీసీలో సిహెచ్ ప్రవళిక 990, బైపీసీలో అర్చన, జయశ్రీ 985, ఎంఈసీలో మదిహ తరన్నమ్ 976, సీఈసీలో ఆర్ శ్రీధర్ 950 మార్కులను సాధించారని వివరించారు.
కేజీబీవీల ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ప్రభంజనం సృష్టించాయి.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఎ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 172 కాలేజీల నుంచి 8,556 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 7,413 (86.64 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని వివరించారు. ఇందులో వందశాతం ఉత్తీర్ణత పొంది న కాలేజీలు 16 ఉన్నాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 208 కాలేజీల నుంచి10,230మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే, 8,288 (81.02 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. ఇందులో వందశాతం ఫలితాలు సాధించిన కాలేజీలు 14 ఉన్నాయని పేర్కొన్నారు.