Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించి పలు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం,మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.950కి పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరంలో 2,755 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 2,544మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాలలో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్‌లోని గురుకుల కాలేజీ మొదటి రెండవ,సంవత్సరం ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్య దర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య భట్టు, అభినందించారు.