Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, సాగు భూములు ఆక్రమణ ఆపాలనీ కోరుతూ వచ్చే నాలుగో తారీఖున చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేముల పల్లి వెంకట్రామయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయాలనీ, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జె చలపతిరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి ఝాన్సీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అరుణ,పీడీయస్యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్ ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.