Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాకతీయులు దేశం గుర్తుంచుకునేలా పాల సాగించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా వచ్చేనెల ఏడు నుంచి వారం రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కాకతీయ సప్తాహం ఉత్సవాల ఏర్పాటుకు సంబంధించిన సన్నాహక చర్యలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కాకతీయుల స్ఫూర్తితోనే కాకతీయ మిషన్ పేరుతో చెరువుల పూడిక తీత కార్యక్రమాలు సీఎం నిర్వహించారని చెప్పారు. బంగారు తెలంగాణ రూపకల్పన ను కాకతీయుల నుంచే స్ఫూర్తి పొందారన్నారరని తెలిపారు. ఈ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ చేసిన ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించామన్నారు. సమీక్షా సమావేశంలో దాస్యం వినరు భాస్కర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, అరవింద్ ఆర్యా పాల్గొన్నారు.