Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి, 12వ తరగతి ఫెయిలైన విద్యార్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)లో ప్రవేశం పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు ఎన్ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకులు అనిల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విద్యార్థులు ఫెయిలైన మార్కుల షీట్ లేదా ఒరిజినల్ అడ్మిట్ కార్డు ద్వారా ప్రవేశం పొందొచ్చని సూచించారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పది, 12వ తరగతి పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులు లేదా పరీక్ష రాసేందుకు అర్హత కలిగిన వారు ఎన్ఐఓఎస్ స్ట్రీమ్ 2లో ప్రవేశం పొందేందుకు అర్హులని తెలిపారు. ఎన్ఐఓఎస్ కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అర్హులని తెలిపారు. ప్రవేశం పొందడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా 040 24752859, 24750712 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://nios.ac.in, https: //admis.nios.ac.in వెబ్సైట్లను చూడాలని కోరారు.