Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించటాన్ని నేరంగా భావిస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తున్నదని గుర్తుచేస్తున్నదని తెలిపారు. ఆమె రాజ్యాంగబద్దంగానే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారని తెలిపారు. 2002నాటి గుజరాత్ అల్లర్ల కేసులో పౌర హక్కుల కార్యకర్త తీస్తా సేతల్వాదును పోలీసులు ముంబైలో అరెస్టు చేయడం అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నదని పేర్కొన్నారు.