Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను నాలుగు వందల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయినట్టు అప్పటి కలెక్టర్ ప్రకటించారని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. మూడు ఈవీఎంలు కౌంటింగ్ తేడా ఉందని చెప్పినా వినకుండా ఫలితాన్ని ప్రకటించారని ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజే తాను రీకౌంటింగ్ చేయాలంటూ పట్టుపట్టానని తెలిపారు. అందుకు సంబంధించి తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలను హైకోర్టుకు అందించాననీ, అయినా రీకౌంటింగ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు ఓప్పుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ద్వారా రీకౌంటింగ్‌కు ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కొప్పులకు నిజాయితీ ఉంటే రీకౌంటింగ్‌కు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.