Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడుకుని వదిలేయడం కేసీఆర్ నైజం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు పీవీ ఘాట్‌కు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరినీ వాడుకుని వదిలేయడం ఆయన నైజమని విమర్శించారు. పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌ను బండి సంజరు సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పీవీ బహుభాషాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు పీవీ తెలుగు ఠీవీ అన్న కేసీఆర్ అవి అయిపోయాక ఆయనను మరిచిపోయారని విమర్శించారు. పీవీ ఘాట్‌కు వందకోట్ల రూపాయలు ఖర్చుపెడతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పీవీ జన్మస్థలమైన వంగర గ్రామాభివృద్ధి, స్మారక కేంద్రం హామీ ఏమైందని నిలదీశారు. ఏ నాయకుడి జయంతి, వర్థంతులనైనా మానవతాస్ఫూర్తితో నిర్వహించాలన్నారు.