Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత
నవతెలంగాణ-దంతాలపల్లి
అవిభక్త కవలలైన వీణ-వాణి ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో వారికి గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం గ్రామానికి చెందిన వీణ-వాణిలు ప్రస్తుం హైదరాబాద్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. అలాగే అవిభక్త కవలలకు సహకరించిన అధికారులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.