Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంజారా మహిళా ఎన్జీఓ ఫౌండర్ డా.ఆనంద్, హరి ప్రియా రెడ్డి సంయుక్తంగా హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న వికలాంగ విద్యార్థులకు భవిత సెంటర్లో స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సుజాత, ఈసీ గోపాల్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.ఆనంద్ మాట్లాడుతూ, ఆటిజం, వినికిడి సమస్య, సెరిబ్రల్ పాల్సీ వంటి వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను గత ఐదు సంవత్సరాలుగా తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నానని తెలిపారు.