Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- తట్టిఅన్నారం వద్ద ఐద్వా రాస్తారోకో
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
వరంగల్ జిల్లా జక్కలొద్ది గ్రామంలో నివాసం కోసం నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి గుడిసెలు తొలగించడం దారుణమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఆ ఘటనను నిరసిస్తూ.. మంగళవారం హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టి అన్నారం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. జక్కులొద్దిలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసముంటే.. అధికారులు, పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి రత్నమాలతోపాటు అనేక మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయ, వృత్తి సంఘాల నాయకులు పగడాల యాదయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు నరసింహ,నాయకులు మునీందర్రెడ్డి, సర్వయ్య సౌజన్య, మహిళలు పాల్గొన్నారు.