Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
- రోడ్డుపై టాక్టర్లు నిలిపి రైతుల నిరసన
- అడ్డుకున్న పోలీసులు..పరిస్థితి ఉద్రిక్తం
- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో
నవతెలంగాణ-మిర్యాలగూడ
పంట పొలాలకు శరణ్య గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి దారి ఏర్పాటుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లతో వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రెండ్రోజుల కింద దారి విషయంలో నందిపాడు పరిధిలోని శరణ్య గ్రీన్హోమ్స్లో కాలనీవాసులకు, రైతు లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు కొంతమందిపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్దఎత్తున రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యానికి తరలివచ్చారు. ట్రాక్టర్లను రోడ్డుపై ఉంచారు. రైతులు కార్యా లయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డు కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని నందిపాడు శివారులో రైతులకు సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయన్నారు. వా టి వద్దకు వెళ్లేందుకు కాలనీ నుంచి అనుమతించాలని పలుమార్లు కాల నీవాసులను కోరినప్పటికీ స్పందించడం లేదన్నారు. దారి వివాదంలో పోలీసులు రైతులపై కేసు నమోదు చేశారని చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి కేసులను తొలగించడంతోపాటు పంట పొలాలకు దారి ఇప్పి ంచాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇం దుకు స్పందించిన ఎమ్మెల్యే భాస్కర్రావు.. దారి ఏర్పాటు గురించి కాల నీవాసులు, మున్సిపల్ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు.