Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఉన్మాదులు హత్య చేయడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. హత్యకు పాల్పడిన ఉన్మాదులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. మతం పేరుతో హత్యలకు పాల్పడే వారు ఏ మతానికి చెందిన వారైనా వారి చర్యలను ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. అప్పుడే మతోన్మాదులకు, ఛాందసవాదులకు సమాజంలో అవకాశం లేకుండాపోతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని భావించే మతోన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజస్థాన్‌లో జరిగిన టైలర్ హత్య ఆ కోవలోనిదే. ప్రజలు సంయమనంతో వ్యవహరించడం ద్వారా ఇలాంటి ఉన్మాదుల కుట్రలను తిప్పి కొట్టాలని అబ్బాస్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.