Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగిలిన నిధులు కేటాయించాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడ్జెట్ విషయంలో ఈఎస్ఐసీ నుంచి రావాల్సిన రూ.442 కోట్లకుగాను రూ.228 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఈఎస్ఐసీ పదో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిగిలిన నిధులను వెంటనే కేటాయించాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 15 డిస్పెన్సరీలకు సంబంధించిన భవనాలను త్వరలో గుర్తించి, వాటిని ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్పెన్సరీల స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని రీజనల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. డిస్పెన్సరీలు అన్ని వసతులతో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.