Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే నెల 2, 3 తేదీల్లో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ హౌర్డింగులు ఏర్పాటు చేయనీయకుండా టీఆర్ఎస్ మొత్తం బ్లాక్ చేయడం చౌకబారుతన మనీ, చిల్లర రాజకీయాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 ఏండ్ల కింద హైదరాబాద్ వైస్రారు హౌటల్ లో నిర్వ హించిన సమావేశాలకు అప్పటి ప్రధాని వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ హాజరయ్యారని గుర్తు చేశారు. జూలై 3వ తేదీన జరిగే బహిరంగ సభకు విజరు సంకల్ప్ సభగా పేరుపెట్టామని చెప్పారు. జులై 1న నడ్డా శంషాబాద్ విమాశ్ర యానికి చేరుకుంటారనీ, సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ పట్టణంలో కిలో మీటర్ మేర స్వాగతం పలుకుతూ రోడ్ షో నిర్వహిస్తా మని తెలిపారు. అదేరోజు రాత్రి 7 గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశమవుతారన్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ పార్టీ ఎదిగిన తీరు, తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాట ఘట్టాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జులై 2న ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారులతో నడ్డా సమావేశమవుతారనీ, సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశాలను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు.