Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బై..బై చెప్పడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మూడో తేదీన జరిగే మోడీ బహిరంగ సభకు 35వేల పోలింగ్‌బూత్‌ల నుంచి కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లాగా బీజేపీ ఒక వ్యక్తికి సంబంధించిన పార్టీ కాదని చురకలంటించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల ఏవిధంగా ఉంటుందో కేటీఆర్‌కు చూపెడతామన్నారు.