Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ రిచా మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. బుధవారం ఆమె హైదరాబాద్లోని బీఆర్కె భవన్లో సోమేశ్ కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ప్రచురించిన ''అన్ఫిల్డ్ బారెల్స్, ఇండియాస్ ఆయిల్ స్టోరీ'' అనే పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు. పుస్తక రచయితను, ప్రచురణకు రిచా చేసిన కృషిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా ప్రశంసించారు.