Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు దాసోజు శ్రవణ్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆన్లైన్ యాప్ల బారిన పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, వాటిని వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. ఆ మాఫియా దారుణమైన హింసలు, వేధింపులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. లోన్ రికవరీ ఏజెంట్లను చట్టవిరుద్ధమైన పద్ధతులతో సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడేలా బలవంతం చేశారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ ద్వారా వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలంటూ బాధితులు కోరుతున్నారని తెలిపారు. అధిక వడ్డీ రేట్లకు లోన్లు, ప్రాసెసింగ్ ఫీజు, ఆలస్య రుసుము, ఇతర సాకులతో విపరీతమైన మొత్తాలను వసూలు చేస్తున్నప్పటికీ, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ మొండిచేయి చూపుతున్నదని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమయాల్లో చిన్న మొత్తాలను కూడా అందించాలని కోరారు. రుణాలు పొందిన మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.