Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి డయాలిసిస్ సెంటర్ మంజూరైంది. 30 పడకల నుంచి వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అయిన ఆ ఆస్పత్రికి డయాలిసిస్ సెంటర్ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సెంటర్ మంజూరు పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.