Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రొప్రియేట్ అధారిటీ నియామకం:
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సరోగసీ (అద్దెగర్భం) సేవల నియంత్రణ, పర్యవేక్షణ కోసం నూతన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) చట్టం 2021, సరోగసీ (అద్దెగర్భం) (నియంత్రణ) చట్టం -2021 అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రొప్రియేట్ అథారిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి నుంచిరాష్ట్రంలోని అన్ని అసిస్టెడ్ రిప్రొ డక్టివ్ టెక్నాలజీ క్లినిక్లు, బ్యాంకులు, సరోగసీ క్లినిక్లు తప్పనిసరిగా ఈ రెండు చట్టాల కింద నమోదు చేసుకోవాలని తెలిపారు. అందుకనుగుణ ంగా జిల్లా వైద్యారోగ్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.