Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చండీగఢ్‌లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొంటున్నరాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక ''చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్''ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ కౌశల్ అక్కడ ఉన్న సదుపాయాలు, అందిస్తున్న సేవల గురించి మంత్రికి వివరించారు. తెలంగాణ వైద్యరంగంలో వస్తున్న మార్పులను మంత్రి వారికి తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌లు ఉన్నారు.