Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సర ంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) రాతపరీక్ష గురువారం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్‌కు 52,687 మంది అమ్మాయిలు, 61,287 మంది అబ్బాయిలు కలిపి 1,13,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. పాలిసెట్ రాతపరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 365 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్ష గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగు తుందని వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి నిరాకరిస్తామని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటించామని తెలిపారు. అభ్యర్థులు గంట ముందే అంటే ఉదయం పది గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి రావాలని సూచించారు. అభ్యర్థులు బ్లాక్ పెన్సిల్, ఎరెసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ను తెచ్చుకోవాలని కోరారు.