Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 7న మహాధర్నా... సన్నాహక సమావేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్య, ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు యస్పీసి) ఆధ్వర్యంలో జులై 7న హైదరాబాద్ ధర్నాచౌక్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయడం కోసం యుయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఐదు బృందాలుగా ఏర్పడి జూన్ 30, జులై 1, 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ ప్రతి బృందం ఉదయం, మధ్యాహ్నం జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తా రు. మార్గమధ్యంలోని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల నుంచి సమస్యలను సేకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కేంద్రంలో సన్నా హక సమావేశం జరుగుతుంది. ఉదయం ప్రెస్‌మీట్‌కు జిల్లా నాయకులు, సాయంత్రం సమావేశానికి కార్యకర్తలతో పాటు ఉపాధ్యాయులు హాజరౌ తారు. మొదటి బృందం మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటిస్తుంది. రెండవ బృందం వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, జనగామ జిల్లాలు. మూడవ బృందం నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలు. నాలుగో బ ృందం భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మహబూబబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు. ఐదో బృందం కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తుందని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.