Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమిళనాడులో ఇటీవల ముగిసిన 10వ సౌతిండియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు సత్తా చాటారు. 84 కేజీల విభాగంలో జె.సాయికిరణ్, 125 కేజీల విభాగంలో జె.నర్సింగ్ రాజ్ గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు. రెజ్లింగ్ పోటీలో ఇద్దరు అన్నదమ్ములు సత్తా చాటారని కొనియాడారు. వీరువురు హైదరాబాద్లోని జియాగూడకు చెందిన వారు కావడం గమనార్హం.