Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. వీటిలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కవిత బుధవారం మధ్యాహ్నం ఇక్కడి తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించి, సాయంత్రం జరిగే సభలో ప్రసంగింస్తారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ మహాసభల్లో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరిస్తారని వివరించారు. మహాసభల నిర్వహణ కోసం 80 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.