Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతీయ తపాలా శాఖలో కమిషన్ ఆధారంగా తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించడానికి ఏజెంట్లను నియమిస్తున్నట్టు సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కె. సంతోష్ నేత తెలిపారు. 10వ తరగతి పాస్ అయి, 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత బీమా సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తులను జులై 15వ తేదీ లోపు సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ చిరునామాకు పంపాలి. ఎంపికైన అభ్యర్థులు జులై 20వ తేదీ ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఏజెంటుగా నియమితులైన వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయంలో సంప్రదించాలని వివరించారు.