Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్ర మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల వుదామని అజిలాపూర్ సర్పంచి రాంజీ నాయక్ అన్నారు. బుధవారం వెల్డండ మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అంజి నాయక్ గ్రామ ఉపాధి కూలీలతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలు తీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజి నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు తెలంగాణలో పెరిగిన నాలుగు శాతం అడవుల విస్తీర్ణానికి నిదర్శ నం అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించు కునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరితరాణి గ్రామ కూలీలు ఉన్నారు.