Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజు చెల్లింపునకు తుదిగడువు జులై 6
షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు ఒకటి నుంచి పదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఫీజు చెల్లింపునకు తుదిగడువు వచ్చేనెల ఆరో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. వచ్చేనెల 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వచ్చేనెల 22న నైతికత, మానవ విలువలు పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్
తేదీ మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం
ఉదయం 9 నుంచి 12 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు
1.08.2022 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
(సోమవారం)
02.08.2022 ఇంగ్లీష్ పేపర్-1 ఇంగ్లీష్ పేపర్-2
(మంగళవారం)
03.08.2022 మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ
(బుధవారం) బాటనీ పేపర్-1 బాటనీ పేపర్-2
పొలిటికల్ సైన్స్ పేపర్-1 పొలిటికల్ సైన్స్ పేపర్-2
04.08.2022 మ్యాథమెటిక్స్ పేపర్-1బి మ్యాథమెటిక్స్ పేపర్-2బి
(గురువారం) జువాలజీ పేపర్-1 జువాలజీ పేపర్-2
హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2
05.08.2022 ఫిజిక్స్ పేపర్-1 ఫిజిక్స్ పేపర్-2
(శుక్రవారం) ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2
06.08.2022 కెమిస్ట్రీ పేపర్-1 కెమిస్ట్రీ పేపర్-2
(శనివారం) కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2
08.08.2022 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
(సోమవారం) బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2
(బైపీసీ విద్యార్థులకు మాత్రమే) (బైపీసీ విద్యార్థులకు మాత్రమే)
10.08.2022 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2
(బుధవారం) జాగ్రఫీ పేపర్-1 జాగ్రఫీ పేపర్-2