Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ డబ్బులు అందుతాయి
- మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టీకరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు బంధు పథకంపై దుష్పచారం చేయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెట్టుబడి సాయం అందరికీ అందుతుందని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల మంత్రుల నివాస సముదాయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. 10 ఎకరాల లోపు రైతులకు సింహభాగం రైతుబంధు నిధులు అందుతున్నాయన్నారు. 92.5 శాతం చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. గతంలో ఎనిమిది విడతల్లో రూ.50.448 కోట్ల సాయమందించగా, తొమ్మిదోవ విడతలో 65 లక్షల మందికి రూ.7,508 కోట్లు అందుతాయని చెప్పారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతున్నదని వివరించారు. స్వామినాథన్ కమిటీ సిఫారుసుల సంగతేంటీ? అని నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ రైతాంగానికి మోడీ చేసిందని సున్నా అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ...వారికి ఖర్చులు మాత్రం రెట్టింపు చేశారని విమర్శించారు. వ్యవసాయ ఖర్చులతో కలిపి 50 శాతం మద్దతు ధర నిర్ణయిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల పోరాటంతో తోకముడిచి వారికి క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద వెనకబడిన ప్రాంతాల ప్రాతిపదికన రాష్ట్రానికి రూ.1,350 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ నుంచి ఏడేండ్లలో రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో వెళ్లగా కేంద్రం నుంచి తిరిగి వచ్చినవి రూ.1,68,647 కోట్లేనన్నారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో ముగ్గురు ఆర్బీఐ గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేశారని చెప్పారు. ఉన్నత పదవుల్లో ఉన్న ఎంతో మంది కీలకమైన అధికారులు తమ పదవులకు రాజీనామాచేశారని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎమ్డీ డాక్టర్ కేశవులు తదితరులు ఉన్నారు.
పంటల నమోదు కొత్త యాప్ : మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరణ
పంటల వివరాల నమోదు కోసం రూపొందించిన ఏఈఓ యాప్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి డీఏఓలు, ఏడీఏలు, డీహెచ్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, అదనపు సంచాలకులు విజరు కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను కూరగాయల సాగువైపు మళ్లించాలని సూచించారు. ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకుని ఉద్యాన పంటల వైపు మళ్లించాలని కోరారు. అక్టోబరు నుంచి మే వరకు వేయగలిగే పంటలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా సన్నద్దం చేయాలని ఆదేశించారు. అన్ని రైతువేదికల్లో తప్పనిసరిగా బంతిపూల చెట్లను నాటాలని సూచించారు. డీఏవోలు క్షేత్రస్థాయి లో పర్యటనలు చేయాలని కోరారు. ఎరువులు, విత్తనాలు ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల నమోదు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు.