Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేయనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు వాటిని విడుదల చేస్తారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత మే 23 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలల నుంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలున్నారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలు రాశారు. పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు www.bse.telangana.gov.in,www.bseresults.telangana.gov.in వెబ్సైట్లను సంప్రదించాలి.