Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలికలదే పైచేయి
- 11,343 మందికి 10కి 10 సీజీపీఏ
- 3,007 పాఠశాలల్లో వందశాతం పాస్
- అగ్రస్థానంలో సిద్ధిపేట, అట్టడుగున హైదరాబాద్
- ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ..ఫలితాలు విడుదలచేసిన మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా నేపథ్యంలోనూ పదో తరగతి ఫలితాలు మెరుగ్గానే వచ్చాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు గతంలో ఎనిమిది, తొమ్మిదో తరగతి పరీక్షలు రాయలేదు. రెండేండ్ల తర్వాత ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాశారు. అయినా ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవ సేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచా లకులు ఎ కృష్ణారావు పాల్గొన్నారు. కరోనా సమయంలో 2020, 2021 లో పదో తరగతి పరీక్షలను నిర్వహి ంచలేదు. దీంతో రెండేండ్ల నుంచి వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2019లో పరీక్షలు జరిగినపుడు పదో తరగతి ఫలితాల్లో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే అప్పటి కంటే ఇప్పుడు 2.43 శాతం ఉత్తీర్ణత తగ్గడం గమనార్హం. విద్యార్థులు రెండే ండ్ల నుంచి పరీక్షలు రాయకపోవడం, ఎనిమిది, తొమ్మిది తరగతుల పాఠ్యాం శాలపై అవగాహన లేకపోవడం, ఆన్లైన్, ఆఫ్లైన్లో బోధన జరిగినా పాఠాలు సరిగ్గా అర్థం కాకపోవడం వంటి సమస్యలు వారిని వెంటాడా యి. ఇప్పుడు పదో తరగతి చదివారు. అయినప్పటికీ 90 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. రెగ్యు లర్ విద్యార్థులు 5,03,579 మంది హాజరుకాగా, 4,53,201 (90 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధిం చారు. బాలురు 2,55,433 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,23,779 (87.61 శాతం) మంది ఉత్తీర్ణత పొం దారు. బాలికలు 2,48,146 మంది ప రీక్షలు రాయగా, 2,29,422 (92. 4 5 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బా లురు కంటే బాలికలు 4.84 శాతం మ ంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత
రెగ్యులర్ విద్యార్థులకు సంబం ధించి 3,007 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈసారి 15 పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలు వచ్చాయి. గురుకుల పాఠశా లలు 99.32 శాతంతో అత్యధిక ఉత్తీర్ణ తను నమోదు చేశాయి. ప్రభుత్వ పాఠశాలలు 75.68 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణతను సాధించాయి. గురుకుల, బీసీ, ఎస్టీ, మోడల్, మైనార్టీ, ఎస్సీ గురుకులాలతోపాటు కేజీబీవీల్లో ప్రయివేటు పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఆశ్రమ పాఠశాల లు, ఎయిడెడ్, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం 90 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణతను పొందాయి.
ప్రయివేటు విద్యార్థులు 51.89 శాతం పాస్
పదో తరగతి పరీక్షల్లో ప్రయివేటు విద్యార్థులు 819 మంది హాజరుకాగా, 425 (51.89 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 448 మంది పరీక్షలు రాయగా, 207 (46.21 శాతం) మంది పాసయ్యారు. బాలికలు 371 మంది పరీక్షలకు హాజరుకాగా, 218 (58.76 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలే పైచేయి సాధించడం గమనార్హం.
97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట ప్రథమం
పదో తరగతి ఫలితాల్లో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 14,869 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 14,550 (97.85 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 97.73 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 9,642 మంది పరీక్షలు రాయగా, 9,423 (97.73 శాతం) మంది పాసయ్యారు. ఇక మూడో స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా నుంచి 22,363 మంది పరీక్షలు రాస్తే, 21,636 (96.75 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 79.63 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి హైదరా బాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 73,957 మంది పరీక్షలు రాయగా, 58,889 (79.63 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు 18
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ పరీక్షలు వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు జరుగుతా యని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని అన్నారు. రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దర ఖాస్తు చేసిన వారు వాటి ఫలితాల కోసం ఎదురు చూడ కుండా ఈ పరీక్షల కు ఫీజు చెల్లించాలని కోరారు. విద్యా ర్థులు సంబంధిత పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు ఫీజు చెల్లింపు తుది గడువు ఈనెల 18 వరకు ఉందని చెప్పారు. ఆలస్య రుసుం రూ.50తో ఆ సబ్జెక్టు ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని సూచించారు. ఫలి తాలు వెల్లడించిన 15 రోజుల్లో రీకౌం టింగ్, రీవెరిఫికేషన్ కోసం దర ఖాస్తు చేయాలని కోరారు. రీకౌంటిం గ్కు సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించా లని చెప్పారు. వివరాల కోసం షషష. bరవ.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.