Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25 లక్షలకు నిధులు పెంచండి
- కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కి ఎర్రబెల్లి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో వెయ్యి నూతన పంచాయతీ భవనాలను మంజూరు చేయాలనీ, వాటికి నిధులు విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఆయనను కలిశారు. పలు అంశాలపై లేఖలను అందజేశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ..శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పనులను రాష్ట్రంలో పునరుద్ధరించాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీరాజ్ నూతన భవనాలకు ప్రస్తుతం ఉపాధి హామీ కింద ఇస్తున్న రూ.20 లక్షల నిధులను రూ.25 లక్షలకు పెంచాలని విన్నవించామని తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీభవనాలను మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై వివరించామని తెలిపారు.
పీఎంఏవైజి నమూనా ఇల్లును ప్రారంభించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రాంగణంలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన గ్రామీణ్(పీఎంఏవైజీ) పథకంలో భాగంగా నమూనాగా కట్టిన ఇల్లును కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ హంగులతో ఉన్న మోడల్ హౌజ్ నిర్మాణంలో గల విశిష్టతల గురించి వివరించారు. కేడబ్ల్యూరూఫ్టాప్ సోలార్ యూనిట్ నెట్ మీటరింగ్‌తో అన్గ్రిడ్ కనెక్ట్ చేయడంతో ఇంటి విద్యుత్ అవసరాలు తీరిపోతాయన్నారు. వర్షపు నీటిని పొదుపు చేసేలా ఏర్పాటు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ జి.నరేంద్రకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.