Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒకరోజు ముందు బీజేపీకి బిగ్‌షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా ఈనెల 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జోష్ మీద ఉన్న బీజేపీకి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒకరోజు ముందే నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ షాక్ ఇచ్చారు. వారు గురువారం టీఆర్ఎస్లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్‌గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్‌లీడర్ సింధూజగౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటిగోపినాథ్, ఎమ్మెల్యే దానంనాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కార్పొరేటర్లను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.