Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మాదిరిగానే పదవ తరగతి ఫలితాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మరోసారి విజయ కేతనం ఎగురేయటం సంతోషంగా ఉందన్నారు. పదో తరగతిలో స్టేట్ సరాసరి 90శాతం కాగా,ఈ సొసైటీకి చెందిన విద్యార్థులు 98.14శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 18,545మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 18,200మంది పాసయ్యారన్నారు. వీరిలో 287మంది నూటికి నూరు శాతం ( 10/10) మార్కులు సాధించారని తెలిపారు.పదో తరగతిలో సొసైటీకి చెందిన 126 పాఠశాలల్లో 100శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.ఎస్సీ గురుకుల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది కృషిని అభినందించారు.